27, అక్టోబర్ 2017, శుక్రవారం


నీలాకాశంలో నిండు జాబిలి 
కట్టెదుట నవ్వుతూ నెచ్చెలి 

వెన్నెల కన్ను గీటింది 
ఏమిటి కవివర్యా !
నన్ను మరిచి పోయినట్టున్నావు 
నిలదీసింది 

ఆమె పొట్ట చెక్కలయ్యేలా 
పడిపడి నవ్వింది 
సమాధానం చెప్పు 
వెన్నెల నిన్నేగా అడుగుత! 

ఆమె పరిహాసానికి 
ఎక్కడ పారి పోతుందోనని 
వెన్నెలని ఒడిసిపట్టి 
ఆమె పెదవిపైన చేర్చాను ,
అందమైన నవ్వుగా మార్చాను 

‘’నీవు గాక వేరెవరైనా -నవ్వలేరు వెన్నెల లాగా
నీవు లేక వెన్నెల లయినా -నవ్వలేవు పున్నమి వేళా ‘’

ఇద్దరి అనుబంధం కలగలిపిన గీతం వినిపించాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి