27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఈ వారం గీతం --౩ 

హత్తుకో ఇంకా ఇంకా
అల్లుకో వాగు వంకా 
జడివానలు నాలో కురిసే దాకా 
సుడి గాలులు చెల రేగే దాకా
వాన వరద ఒకటై
చెరిసగమై పోయే దాకా //

పొంగి పొర్లుతున్నవి పరువాలు
నింగి నంటుతున్నవి విరహాలు
తనువంతా వింత వింత మోహాలు
తనివి తీరని తాపాలు దాహాలు

కారు మేఘమై కదిలి రావయ్యా
కుండపోతగా కురిసి పోవయ్యా//

ఒళ్ళంతా ఓపలేని ఆవిరులు
ఓదార్చ లేవులే ఏ విరులు
మనసున ముసురుకున్న మరులు
ఎక్కడివి ఇన్ని అల్లరులు

కొదమ సింగమై రావయ్యా
కృష్ణునిలా ఎత్తుకు పోవయ్యా //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి