27, అక్టోబర్ 2017, శుక్రవారం

నిన్ను చూడాలని 
సన్నజాజి తీగ పైపైకి పాకింది 

ఎలాగైనా నిన్ను చేరాలని 
పరుగు తీసే సెలయేరు 
కొండ కొనకొమ్ము నుంచి కిందకి దూకింది

నింగిలోని నీలి మేఘం
నేలకి దిగి వచ్చి
ఒక చినుకై నీ తనువును తాకింది

చూసావా
ప్రకృతి ప్రతి అణువులో
ఎన్ని సన్నాహాలో నిన్ను చేరుకోడానికి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి