27, అక్టోబర్ 2017, శుక్రవారం

పరుగు పరుగు 
ఒకటే పరుగు 
బ్రతుకంతా 
బాధలతో పేరాశలతో
చిక్కులతో చికాకులతో 
ఒకటే పరుగు

ఈ పరుగుల్లో వాడు
ఎన్నడు చూడలేదు
వెన్నెల వెలుగు

సంపాదన ఒక్కటే వాడి ఆశయం
అంతులేని ఆ దాహమే వాడి వినాశనం

పరుగెత్తి పరుగెత్తి
వాడు అలసిపోయాడు
పరుగు పందెంలో ఓడిపోయాడు
ముసలి వాడైనాడు ...పరుగు ఆపేసాడు

వాడి పరుగు ఫలితం
ఎక్కడో ఏ నగరాలలోనో
నేలమాళిగల్లోనో దాగి ఉంది
అది ఎంతకూ వెలుగు చూడకుంది

వాడి అస్థి పంజరం మాత్రం భూమిలో ఉంది
వాడి ఆస్థి సర్వస్వం భూమిలోనే ఉంది

అస్థి పంజరం
ఎక్కడుందో అందరికి తెలుసు
అయితే రహస్యంగా పాతి పెట్టిన
ఆస్థి వివరాలు మాత్రం ఎవ్వరికి తెలియవు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి