27, అక్టోబర్ 2017, శుక్రవారం

నువ్వు 
ఏమి ఆలోచిస్తున్నావన్నది కాదు 
ఎలా జీవిస్తున్నావు అన్నది కాదు 

ఎలా ఉండాలనుకొంటున్నావు అన్నది ముఖ్యం 
ఏ గిరి శిఖరాలు అందుకోవాలని
అనుకొంటున్నావో అది ముఖ్యం

గమ్యం అందుబాటులో లేకున్నా ఫరవా లేదు
అసలు గమ్యమే లేకుండా ఉండి పోరాదు

గమ్యం ఒక హర్మ్యం అయితే
ఎన్ని అంతస్తులైనా ఎక్కగలవు
గమ్యం గగనం అయితే
ఎంతకాలానికి అక్కడికి చేరుకోలేవు

తెలిసిందా గమ్యం ఎంచుకోడంలోనే తెలిసిపోతుంది నీ సత్తా
నడకని రసరమ్యంగా మలచుకోడం లోనే ఉంది భవిష్యత్తంతా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి