27, అక్టోబర్ 2017, శుక్రవారం

చిలిపి సరాగం 
----------------

'విన్నవించుకోనా చిన్న కోరికా 
ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరికా ‘’
----
ఎప్పుడు విన్నవించు కొంటునే ఉన్నావు కదా
ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది... విన్నవించే దేముంది
------
మనసులో మాట మనసైన వారికీ
ఎన్నిసార్లు చెప్పినా కొత్తగానే ఉంటుంది
ఎన్నాళ్ళయినా మనసు పాత బడదు కదా
ఎన్ని సార్లు పదే పదే ఈ రామాయణం అనగలమా
-------
అలా వచ్చావా సరే ఆ కోరిక ఏమిటి
ఆ అభిసారిక ఎవరు .. ప్రియతమా
------
ఆ కోరిక నేను ....... నా అభిసారిక నీవు
-----
.నేను .....సారికను కాదేమో ....
ఎప్పుడు ఎదురు చూచేది నువ్వేకదా కళ్ళు కాయలు కాచేలా
-------
నిజమే కాని...
ఎదురుగా ఇలా.. మనలా ..కూచుని
హాయిగా తీయగా మాటాడుకొనే సమయాలు
మనోహర దృశ్యాలు ...ఈనాడు అరుదు కదా
------
ఔ నౌను.... అలాగని చెప్పేవే గా నీ కావ్యాలు అన్నీ ..
---
నా కావ్యం, నీవే కదా
---
''కన్నులు నీవే కావాలి ...
కలనై నేనే రావాలి ...
కావ్యం నీవై నిలవాలి''

ఇలా వద్ద చేరి ముద్దుముద్దుగా ఇలా
మాటాడుకుంటుంటే
హాయిగా పాడుకొంటుంటే ఎంత బావుంటుందో
----
అది చెప్పాలనే కదా
నువ్వు ఈ మధ్య ఈ చిలిపి కావ్యాలు రాస్తున్నది
----
కాని ..ఈ నిజం అర్ధం చేసుకొనే వారెందరు , చదివే వారెందరు
జీవితాన్ని ప్రేమించేది ఎందరు ...ఇలా నిండుగా జీవించేది ఎందరు ....
ఏమిటో ఈ మనుషులు ......
ఎంత చెప్పినా ఎవ్వరూ ..అరె ...అసలు అర్ధం చేసుకో.......రూ

------------------------------------------------------
గమనిక ==
ప్రతి మాట చివర ''అర్ధం చేసుకో..........రూ''' ----------- అని దీర్ఘం తీస్తూ ఒక నాయిక తన విశాల నయనాలు కంటి పాపల్ని చిత్రంగా తిప్పుతూ చిలిపి తనం ప్రదర్శి స్తుంది ఒక చిత్రంలోని దర్శకుని ప్రతిభ అది -అదే అంశాన్ని భూమికగా చేసుకొని ''అర్ధం చేసుకోరూ'' అనే ఆ పదాన్ని ప్రాతిపదికగా కొన్ని కవితలు రచించాను
అందు లోంచి ఇప్పుడు మీకోసం ఒక చిలిపి సన్నివే
Image may contain: 1 person, closeup

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి