27, అక్టోబర్ 2017, శుక్రవారం

అలలు మనకు ఆదర్శం
---------------------------

Waves are inspiring ,
not because they rise and fall ,
but because
they never fail to rise again

పడి లేస్తున్నందుకు కాదు
విరిగి పడినపుడల్లా
తిరిగి ఎగిసి పడ్తున్నందుకు

ఎన్ని సార్లు
తుత్తునియలైనా
ఆ పట్టుదల విడిచి పెట్టనందుకు

అలలు మనకు ఆదర్శం

అలుపెరుగని
ఆ ఉత్సాహం
ఆ జలధి తరంగ మృదంగ నాదం
నిత్య చైతన్యానికి సంకేతం

నింగిని
తాకాలనే ఆరాటం
నిముసమైనా ఆగని ఆ పోరాటం

ఓ మనిషీ!
అవధరించు
ఉవ్వెత్త్తున
ఎగిసి పడుతున్న ఆ కెరటం
అందించే ఆ అద్భుత సందేశం
------------------------------
నిజం కాదు ఓటమి
నీలో ఉంటె ఓరిమి
Image may contain: ocean, water, nature and outdoor

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి