27, అక్టోబర్ 2017, శుక్రవారం

’నీవు లేక వీణా పలుకలేనన్నది 
నీవు రాక రాధా నిలువలేనన్నది ‘’

నా ఎదలోంచి 
ఒక కూనిరాగం లీలగా వినిపిస్తున్నది 
అచ్చం అది 
నేను వ్రాసిన గీతం లాగే అనిపిస్తున్నది 
మరి ఎవరు 
అంత శ్రావ్యంగా నాలో ఆలపిస్తున్నది 
ఎవరు అన్నాను 

''‘నా ఎదలో 
ఎప్పుడో దొంగలా దూరారు , 
ఎంత నంగనాచి దొరగారు ''

కడకొంగును నడుమున బిగించి, 
చిలిపిగా నడిచొచ్చి, నా చెవి మెలిపెట్టి 
ఏమి తెలియనట్టు 
ఏమిటి ప్రేలాపనలు ఆలాపనలు 
తమరి ఎదలో నేను కాక ఎవరుంటారు 
నీ కవితలు కావ్యాలు 
నాకు వినిపించాకనే కదా 
లోకానికి పరిచయం చేసేది 

ఇంకెవరి కున్నది 
నీ మదిలో చేరే అవకాశం నాకు తప్ప
అసలు నేను లేకుంటే 
నువ్వు ఒక పదమైనా రాయగలవా
ఏమున్నది నీ గొప్ప’ 

తప్పయి పోయింది తరుణీ మణి 
నన్ను మన్నించు 
ఒక చుంబనమో అలింగనమో 
వరమిచ్చి శిక్ష విధించు 

ఇదండీ వరస !
ఆమె నా ఒడిలో చేరి 
ఎదలో దూరి నన్ను వేధిస్తుంటే సాధిస్తుంటే 
ఇంకేమి వ్రాయగలను ! 
ప్రేమ కవితలు- ప్రణయ గీతాలు తప్ప !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి