27, అక్టోబర్ 2017, శుక్రవారం


అతని రూపమే నా మనసు నిండా 
అసలు మా ఆత్మలు ఒకటా రెండా 

నా ప్రేమకై ఆరాటపడే అతని కోసం 
నేనయ్యాను పరిమళాల పూలదండ 

అందుకేనేమో అతి జాగ్రత్తగా దానిని 
కాపాడుకొంటున్నాను వసి వాడకుండా 

నన్ను నన్నుగా మిన్నగా ప్రేమించే 
అతని మెత్తని మనసే నిండు కుండ 

ప్రియమైన తాను కనిపించని నాడు 
చల్లని వేళయినా నాకు మండుటెండ 

ఇంతకూ నాకు అనుమానమే సందేహమే 
మా నడుమ ఈ అనురాగం కాయా పండా
Image may contain: 1 person

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి