నిన్నలన్నీ వెళ్ళిపోయాయి
నీకు నాకు వీడ్కోలు పలుకుతూ
నమ్మలేని నిజాలేవో చెప్పి వెళ్ళాయి
నడక నేర్చిన విధాలు ఏకరవు పెడుతూ
ఇక నాటకానికి తెరలు అవసరమన్నాయి
నిన్నలన్నీ నేడుగా మారిపోయాయి
నీకు నాకు స్వాగతాలు పలుకుతున్నాయి
ఎన్నెన్నో వేడుకలు ఎదురుగా ఉన్నాయి
వాటిని వాడుకోవడం లేదా
వదలు కోవడం నీ పని అన్నాయి
నేడులన్ని రేపుగా మారిపోతాయి
‘రేపు రేపను తీపి కలలకు రూపమిస్తాయి ‘
నిన్న -నేడు -రేపు కలగలిపినదే జీవితం
ఎన్ని మలుపులు తిరుగుతుందో
ఎన్ని హొయలు పోతుందో
ఈ అందాల జలపాతం
నీకు నాకు వీడ్కోలు పలుకుతూ
నమ్మలేని నిజాలేవో చెప్పి వెళ్ళాయి
నడక నేర్చిన విధాలు ఏకరవు పెడుతూ
ఇక నాటకానికి తెరలు అవసరమన్నాయి
నిన్నలన్నీ నేడుగా మారిపోయాయి
నీకు నాకు స్వాగతాలు పలుకుతున్నాయి
ఎన్నెన్నో వేడుకలు ఎదురుగా ఉన్నాయి
వాటిని వాడుకోవడం లేదా
వదలు కోవడం నీ పని అన్నాయి
నేడులన్ని రేపుగా మారిపోతాయి
‘రేపు రేపను తీపి కలలకు రూపమిస్తాయి ‘
నిన్న -నేడు -రేపు కలగలిపినదే జీవితం
ఎన్ని మలుపులు తిరుగుతుందో
ఎన్ని హొయలు పోతుందో
ఈ అందాల జలపాతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి