అన్ని
పరిమళాలు
మోయలేక
డీలా పడినది మలయానిలం
అది చూచి
అయ్యో అని
ఆమె అందించినది
తన చేలాంచలం
ఆనందంతో
పయ్యెద ఎగిరింది
గాలిపటం లా
వీచే గాలితో,
పూచే పూలతో,
పారే సెలయేటి నీటితో
పరిసరమే మారిపోయింది
ఒక యమునా తటంలా
పరిమళాలు
మోయలేక
డీలా పడినది మలయానిలం
అది చూచి
అయ్యో అని
ఆమె అందించినది
తన చేలాంచలం
ఆనందంతో
పయ్యెద ఎగిరింది
గాలిపటం లా
వీచే గాలితో,
పూచే పూలతో,
పారే సెలయేటి నీటితో
పరిసరమే మారిపోయింది
ఒక యమునా తటంలా

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి