మల్లెమొగ్గ
బుగ్గ నిమిరి
విచ్చుకో అన్నాను
దిగ్గున విరబూసి
పరిమళాలు వెదజల్లింది
మనిషిని తట్టి లేపి
ఈ అద్భుత చూడమన్నాను
హేళనగా నన్ను చూచి
అదోలా నవ్వాడు
ఇందులో వింత ఏముంది
వీడింతే
ఎన్ని చెప్పినా
ఈ జన్మలో మారడు
మల్లెపువ్వు నవ్వి
నా ఒళ్లో రాలి పడింది
అన్నది కదా !
నువ్వు పువ్వుల్ని ప్రేమిస్తున్నావు
మా నవ్వుల్ని ప్రేమిస్తున్నావు
కాని వాడు దేనికలా రోదిస్తున్నాడు
ఇంకా ఇంకా కావాలని వాదిస్తున్నాడు
వాడికి నీకు ఒకటే తేడా
నువ్వున్నది వెన్నెల వాడ
వాడు కట్టుకున్నది ఒట్టి గాలిమేడ
బుగ్గ నిమిరి
విచ్చుకో అన్నాను
దిగ్గున విరబూసి
పరిమళాలు వెదజల్లింది
మనిషిని తట్టి లేపి
ఈ అద్భుత చూడమన్నాను
హేళనగా నన్ను చూచి
అదోలా నవ్వాడు
ఇందులో వింత ఏముంది
వీడింతే
ఎన్ని చెప్పినా
ఈ జన్మలో మారడు
మల్లెపువ్వు నవ్వి
నా ఒళ్లో రాలి పడింది
అన్నది కదా !
నువ్వు పువ్వుల్ని ప్రేమిస్తున్నావు
మా నవ్వుల్ని ప్రేమిస్తున్నావు
కాని వాడు దేనికలా రోదిస్తున్నాడు
ఇంకా ఇంకా కావాలని వాదిస్తున్నాడు
వాడికి నీకు ఒకటే తేడా
నువ్వున్నది వెన్నెల వాడ
వాడు కట్టుకున్నది ఒట్టి గాలిమేడ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి