27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఒక మల్లియ 
గుచ్చిగుచ్చి అడిగింది 
నన్నెలా మరిచిపోయావని 

ఆశ్చర్యం గా అడిగాను 
ఎర్రటి ఎండలు మండిస్తుంటే
నువ్వెలా విచ్చావని

వేడి వేడి సెగలతో
ఆలోచనలు అట్టుడుకి పోతుంటే
ఇన్ని పరిమళాలు
ఎలా మోసుకోచ్చావని

మల్లె పువ్వు
మధురంగా నవ్వింది

నేను వచ్చినదే నిన్ను
పరిమళాల డోలలలో ఓలలాడించ డానికి

ఈ మండు వేసవిలో
ఒక క్షణమైనా నీకు ఉపశమనం కలిగించడానికి
నీ చేత ఒక అందమైన కవిత వ్రాయించడానికి
Image may contain: flower, plant and nature

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి