27, అక్టోబర్ 2017, శుక్రవారం

తోట దాటి వెళ్తుంటే 
ఒక గులాబీ 
నాకేసి జాలిగా చూచింది

ఏమైంది అన్నాను 
నా ఉనికి ఇంక కొన్ని గడియలే
నువ్వు కవివి కదా
నాకు చిర యశస్సు ప్రసాదించు
దీనంగా ప్రాధేయ పడింది

వల్లెయని ఈ కవిత సరసన
దానికి స్థానం కల్పించాను
ఇలా ఒకరోజు పువ్వు జీవితాన్ని
కొంత కాలం పాటు పొడిగించాను
Image may contain: flower, plant, nature and outdoor

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి