27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎప్పుడు వచ్చినా 
వెన్నెల్ని పువ్వుల్ని వెంటబెట్టుకొని వస్తుంది
ఎన్నో ముచ్చటలు మురిపాలు 
మూట కట్టుకొని వస్తుంది
ఇవన్ని నీ రచనలకు పరికరాలు సుమా, 
అంటూ అన్నిటిని పరిచయం చేస్తుంది
‘ఇంకా ఏమి కావాలి’,
చిలిపిగా పెదవిని చిలికించి పరాచికమాడుతుంది
ఆమెకు తెలుసు
తాను తెచ్చిన అన్నిటిని
తన అణువణువుకి అనుసంధించి ప్రేమ గీతాలు రాస్తానని
తను వచ్చింది అందుకేనని
కావ్యం ముగియగానే
ఒక ముద్దిచ్చి వెళ్ళిపోవడం ఆమెకు సరదా
నా కావ్యానికి గొప్పదనం
అసలు ప్రయోజనం అప్పుడే కదా
Image may contain: one or more people

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి