27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎండలు మండిపోతున్న వేళ ఒక చల్లని వసంత గీతం మీకోసం 

మబ్బులు దిగి వచ్చాయి చినుకుల చరణాలతో 
గాలులు కదిలోచ్చాయి మమతల గంధాలతో 

నింగి వంగి నేలపై 
వేణువు లూదింది 
అవని గుండె గానమై 
ఆమని విరిసింది //

నందనవన సీమలో నడయాడిన మధుమాసం
నవవసంత వేళలో వినిపించిన ఇతిహాసం 

చిన్నారి మమత ఒకటి 
కళ్ళు తెరుచుకున్నది 
కమ్మని చిరు గీత మొకటి 
ఒళ్ళు విరుచుకున్నది //

ఆకుపచ్చ నేలంతా కొత్త పూల పరిమళం
ఆదమరచి జగమంతా వూగుతున్న మధువనం

రంగుల లోకమొకటి 
కనులముందు వెలసింది 
రమ్యమైన గీతమొకటి 
రాగదార సాగింది //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి