27, అక్టోబర్ 2017, శుక్రవారం

కలల బరువుకు రెప్ప వాలి పోతానంటున్నది 
కనులు మూ స్తే రేయి కరిగి పోతానంటున్నది 

ఎదలోయలలో ఒక వూహ ఉక్కిరిబిక్కిరి చేస్తే 
కప్పుకున్న పయ్యెద జారిపోతానంటున్నది 

ఎంతకీ రాని అతని కోసం రేయంతా వేచి వేచి
తనువు సాలభంజికలా మారిపోతానంటున్నది

పరువంతో విరహంతో విసిగి వేసారిన మనసు
పూలతో పరిమళాల తో చేరిపోతానంటున్నది

అతని పదధ్వని విని అల్లంత దూరాన ఎదురేగి
పాదాలను నడిపించే రాదారి నౌతానంటున్నది

ఒక్క సారి ఎదురైతే చాలు తనువు పరవశంతొ
అతని నిండు ఎదలో దూరిపోతానంటున్నది
Image may contain: one or more people

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి