27, అక్టోబర్ 2017, శుక్రవారం

నా మనసెప్పుడూ పాటలు పాడుకొంటూ ఉంటుంది 
అక్షరాలతో పదాలతో సయ్యాటలాడుకొంటూ ఉంటుంది 

రేయింబవళ్ళు నిర్విరామంగా ఒక అరుణాధరం మీద 
కాలాలకు చెరిగిపోని సంతకం చేస్తూ ఉంటుంది 

లోకంలో జరుగుతున్న అన్యాయం అక్రమం గురించి
ఒక కావ్యం వ్రాసి అఖిల జనావళికి అంకితం చేస్తూ ఉంటుంది

విపరీతమైన వేదనలో కొట్టు మిట్టాడుతున్నప్పుడు
ఒక పాటను పట్టుకొని హాయిగా ప్రయాణిస్తూ ఉంటుంది

మనసుకి హృదయానికి సంఘర్షణ జరిగినప్పుడు
ఒక దీర్ఘ కావ్యానికి శ్రీకారం చుడుతూ ఉంటుంది

అందమైన ఊహలలో విహరిస్తూ ఆనంద విహంగాలు ఎగరేస్తూ
మనసు మలినం కాకుండా తనను తాను కాపాడుకొంటూ ఉంటుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి