27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఈనాటి పాట 
----------------
నీలాల ఆ గగనం 
నీ నడుమును వలచింది 
నిండైన నీ రూపం 
నా ఎదురుగ నిలిచింది

నీలోని సోయగమంతా
రారమ్మని పిలిచింది
మేనిలోని ఈ సింగారం
ఎవరమ్మా మలచింది //

బిగి కౌగిట ఈ రేయి
బింబాధరమయ్యింది
అంతలోనే తెలవారి
అరుణోదయ మయ్యింది
మరు నిముషం ఆ చూపే
మలయానిలమయ్యింది
చిలిపి చిలిపి నీ పిలుపే
కలకూజిత మయ్యింది //

నీలి నీలి కన్నులలో
మందిరాలు కలవేమో
ఆ పసిడి వన్నెలలో
నందనాలు నెలవేమో

పూచిన ఆ విరులన్ని
తొలిరేయి కొరకేమో
దాచి ఆ సిరులన్నీ
దోచుకొనే దొరకేమో
మన ఇద్దరి అనుబంధం
అంతా ఒక కల ఏమో

ఇద్దరిలో ఈ మౌనం
ఇది కలవరమేమో
క ల ర వ మేమో //
Image may contain: one or more people

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి