26, అక్టోబర్ 2017, గురువారం

ఒక విరహ గీతం
------------------
మౌనమా
మధుర గానమా 
ఏల పలుక కున్నావు
ఏల అలుక బూనావు
ఏ నేరం చేసానని
ఇంత శిక్ష వేశావు //
ఈ పెదవి నీదిరా
పరిపాలించే ఆ పదవి నీదిరా
ఈ పూవు నీదిరా
తేనియ చిందించే నెత్తావి నీదిరా
ఏ లుకోవయ్యా
ఇక ఈ అందాలను
నిలువెల్లా నెలవైన
మందార మకరందాలను //
నీవు లేని నేను
నిరుపేదను అనాధను
నిను వలచిన నేను
అలనాటి రాధను మధురగాధను
దాచుకోవయ్యా
ఎద లోపల
ఓపలేనయ్యా
ఈ కలల కాపలా //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి