ఏది ఏమైనా సరే
ఎలాగైనా సరే
ఒక కవిత రాయాలని
తోటలోనికి అడుగు పెట్టానో లేదో
ఆప్యాయంగా తరువులు పలకరించాయి
తీగలు తలలు వంచి నమస్కరించాయి
చోద్యం చూడాలని చిరుగాలులు పరుగున వచ్చాయి
ఆ సందడికి కొన్ని మల్లెలు మందారాలు
నా కవితా ప్రాంగణానికి కదిలి వచ్చాయి
నా కలం చుట్టూ పరిమళాలు పరిభ్రమించాయి
ప్రతి అక్షరం నుదుట
కుంకుమ తిలకం దిద్దాను
ప్రతి పదానికి సిరిగంధం అద్దాను
ప్రతి కల చుట్టూ పరుగులు పెట్టాను
ప్రతి వూహకి పట్టు పరికిణి కట్టాను
ఇప్పుడు నా ప్రతి కవితను
అల్లుకొని మల్లెపూల సౌరభం
నా కవితా ప్రాంగణం నిండా
వేల సుమదళాల సోయగం
ఎలాగైనా సరే
ఒక కవిత రాయాలని
తోటలోనికి అడుగు పెట్టానో లేదో
ఆప్యాయంగా తరువులు పలకరించాయి
తీగలు తలలు వంచి నమస్కరించాయి
చోద్యం చూడాలని చిరుగాలులు పరుగున వచ్చాయి
ఆ సందడికి కొన్ని మల్లెలు మందారాలు
నా కవితా ప్రాంగణానికి కదిలి వచ్చాయి
నా కలం చుట్టూ పరిమళాలు పరిభ్రమించాయి
ప్రతి అక్షరం నుదుట
కుంకుమ తిలకం దిద్దాను
ప్రతి పదానికి సిరిగంధం అద్దాను
ప్రతి కల చుట్టూ పరుగులు పెట్టాను
ప్రతి వూహకి పట్టు పరికిణి కట్టాను
ఇప్పుడు నా ప్రతి కవితను
అల్లుకొని మల్లెపూల సౌరభం
నా కవితా ప్రాంగణం నిండా
వేల సుమదళాల సోయగం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి