ఆలాపన
------------
కనులు
మూసుకొంటే
నీ రూపం గుర్తొస్తున్నది
‘ఓయీ’ అని పిలవాలంటే
ఈ లోకం అడ్డొస్తున్నది
చిరునవ్వులు నీకు
కానుకగా ఇద్దామంటే
అల్లరిగా సిరివెన్నెల
నిన్ను చేరి మురిపిస్తున్నది
నీతో సయ్యాట లాడదామంటే
గాలి కెగిరిన చీర చెరగు
గంధర్వ గానాలు పలికిస్తున్నది
నిన్ను తాకి వచ్చిందేమో
ఈ మలయానిలం
నా తనువును చుట్టుకొని
మైమరపిస్తున్నది
నిను చేరిన వేళ
వెచ్చని శ్వాసల నిట్టూర్పు
మండే వేసవి వడగాలిని తలపిస్తున్నది
రేయి పగలు
నిన్ను వీడని నా ఆలోచన
నా ఎదలోపల జడివాన కురిపిస్తున్నది
------------
కనులు
మూసుకొంటే
నీ రూపం గుర్తొస్తున్నది
‘ఓయీ’ అని పిలవాలంటే
ఈ లోకం అడ్డొస్తున్నది
చిరునవ్వులు నీకు
కానుకగా ఇద్దామంటే
అల్లరిగా సిరివెన్నెల
నిన్ను చేరి మురిపిస్తున్నది
నీతో సయ్యాట లాడదామంటే
గాలి కెగిరిన చీర చెరగు
గంధర్వ గానాలు పలికిస్తున్నది
నిన్ను తాకి వచ్చిందేమో
ఈ మలయానిలం
నా తనువును చుట్టుకొని
మైమరపిస్తున్నది
నిను చేరిన వేళ
వెచ్చని శ్వాసల నిట్టూర్పు
మండే వేసవి వడగాలిని తలపిస్తున్నది
రేయి పగలు
నిన్ను వీడని నా ఆలోచన
నా ఎదలోపల జడివాన కురిపిస్తున్నది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి