27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఏమిటి నువ్వూ 
నీ పిచ్చి కవితలు 
ఆమె ఒకరోజు నిలదీసింది 

నివ్వెరపోయాను 
కెవ్వుమని అరిచాను
నువ్వేకదా నన్ను చెడగొట్టింది
అలనాడే నన్ను చూచి కన్నుగీటింది
ఈ కవితలే రాయమని వెన్నుదట్టింది
ఇప్పుడు నువ్వేనా నన్ను తిట్టింది ఎంత మోసం !

మోసం ద్వేషం కాదు చిట్టినాయనా సంతోషం సంబరం
నా ఆదేశం నిక్కచ్చిగా పాటిస్తున్నావని ఆనందం
ఎంతో పిచ్చిగా ఏకబిగిని వ్రాస్తున్నవని నా ఉద్దేశం

ఒకనాడు
నేను నీలో ప్రవేశ పెట్టిన మధుమాసం
అతి జాగ్రత్తగా కాపాడుతున్నావని హర్షాతిరేకం
నీవు గాక వేరెవరైనా రాయగలరా ఇంతందంగా
నాకు గాక ఎవరికైనా వినిపిస్తుందా ఇంత మధురంగా
అందుకే మన ఇద్దరి బాట అపురూపం
ఇది మన అనురాగానికి ప్రతిరూపం

అని ఒక పంటి గాటు ప్రసాదించి తాను నిష్క్రమిస్తే
ఇంకేం వ్రాయగలను .ప్రణయ కవితలు ప్రేమగీతాలు తప్ప ................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి