26, అక్టోబర్ 2017, గురువారం



హంస గమనమ్ముతో
హరిణ నయనమ్ముతో
మందహాస మధురాధరమ్ముతో 
నువ్వు కదలి పోతుంటే
జంటగా వస్తున్న నాకు 
వెన్నెల ప్రవాహం ఒడ్డున 
నడుస్తున్న భావన 
సమ్మోహనంగా నా చుట్టూ 
పరిమళాల వాన
అప్పుడప్పుడు 
నీ అరమోడ్పునయనాలు
నావంక నెలవంకలౌతు
నిలువెల్లా నీ అందాలకు 
నేనాశ్చర్యంతో తల మునకలౌతు
ఈ ప్రయాణం ....
ఒక జీవిత కాలం కాకూడదా!
నాలో గాఢమైన నిట్టూర్పు
హఠాత్తుగా 
ఆలింగనంలో ఒదిగి 
సుకుమార హస్తాలు నన్నల్లుకోగా 
నీ నీలి నయనాలు ఆర్ద్రం కాగా
ఏమిటి ఏమిటి !!
నీ ఎర్రని పెదవులు విచ్చుకొని 
వెలువడ నున్న తీర్పు 
ఏమది ప్రియతమా ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి