27, అక్టోబర్ 2017, శుక్రవారం

వెన్నెల
నిన్నెలా
ఆకట్టుకున్నదో గాని
నీ అణువణువునా
స్తిర నివాసం ఏర్పరచుకొన్నది
చామంతి
నిన్నెలా
మురిపించిందో గాని
నిలువెల్లా
తన వన్నెచిన్నెలు పులుముకున్నది
గులాబీ
నిన్నెలా
వరించిందో గాని
నీ పెదవి పైన తిష్ట వేసింది
ఇన్ని
సోయగాలు
అద్భుతాలు
సొంతం చేసుకున్న నువ్వు
నన్నెలా
చేరుకున్నావో గాని
నన్ను మనిషిని చేశావు
నాకు అమరత్వం ప్రసాదించావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి