27, అక్టోబర్ 2017, శుక్రవారం

వివాహాలు -విడాకులు- వియోగాలు
----------------------------------
ఏమైనదో ఆలుమగల అనురాగం
నేడు ప్రేమ పెళ్లి అంతా శరవేగం 
రాత్రి పగలు ఉద్యోగాల గోలలో
కనిపించదు ఏ కుసుమ పరాగం
ఎక్కడా కనిపించవు హాయిగా సాగి పోతున్న సంసారాలు
ఎక్కడా వినిపించవు సరస సమ్మోహన జీవన సరాగాలు
అంతటా దాహాలే, వ్యామోహాలే, సందేహాలే, సంఘర్షణ లే
అందుకే బ్రదుకులోకి ప్రవేశించాయి విడాకులు వియోగాలు
డబ్బు యావలో దాంపత్యం తడబడింది
దంపతుల మధ్య సాన్నిహిత్యం కొరవడింది
ఒకరి పై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తుంటే
మూన్నాళ్ళకే వివాహబంధం విడివడింది
విరిపానుపుకేమో ఎవరికీ చెప్పుకోలేని విరహం
ఎడమొహం పెడమొహంతొ రేయంతా కలహం
ముద్దు ముచ్చటలు మూగరాగా లేమైనాయో
ఆగ్రహావేశాలతో గడచి పోతున్నది అహరహం
అర్ధరాత్రి అపరాత్రి అలిసిపోయి వచ్చుట
అప్పుడప్పుడు డబ్బు సంచులు తెచ్చుట
అంతేకాని ఆ నూతన దంపతుల మధ్య
కనిపించదు ఏ విధమైన ముద్దుముచ్చట

అసలు వీళ్ళు ఈ లెక్కల కోసమేనా బ్రతుకుతున్నది
దిక్కుమాలిన ఈ దుఖం లోనేనా రోజులు గడుపుతున్నది
మరి ఎందుకోసమో వైభవంగా ఈ వివాహాలు వై భో గాలు
అర్ధం కాక నేటి యువత సందిగ్ధం లో సతమతమౌ తున్నది
ఎందుకు యువ హృదయాలు రాళ్ళై పోయాయి
వెచ్చని బిగికౌగిళ్ళు ఎందుకు కనుమరుగయ్యాయి
రేయింబవళ్ళు ఎండమావులు వెదుక్కుంటూ
ఏల పండంటి జీవితాలు ఎండిన బీళ్ళయినాయి
---------------- నా కావ్యం 'అ ల జ డి 'నుండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి