27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఈ దేశం నీ కేమిచ్చిందని నీ ప్రశ్న 
దేశానికి నువ్వేం చేశావని నా ప్రశ్న 

ఎంతో కష్టపడి కని పెంచిన తల్లిదండ్రుల్ని 
అవసానంలో ఆదుకున్నావా అన్నది నా ప్రశ్న 

ఏదో ఒక పరమార్ధం ఆశించి ఆ దైవం నిన్ను 
ఇలకు పంపితే నువ్వు ఏం చేశావని నా ప్రశ్న 

జీవితం మున్నాళ్ళ ముచ్చట కదా మూడు తరాలకు
సరిపడా ఎందుకు మూట కడుతున్నావని నా ప్రశ్న 

ఎప్పుడు ఎక్కడ ఎవరికీ చెప్పకుండా ఎగిరిపోతావో 
గుండెకు ముప్పు ఎందుకు తెచ్చుకొంటున్నావని నా ప్రశ్న 

ఎప్పుడు జీవించడం మాని నిర్భయంగా బ్రతకడం మాని 
కుప్పిగంతు లెందుకు వేస్తున్నావని మా అందరి ప్రశ్న

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి