27, అక్టోబర్ 2017, శుక్రవారం


ఒక పచ్చని చెట్టునై 
పుట్టాలని ఉంది
ఒక పిట్టకైనా 
ఆటపట్టును కావాలని ఉంది 

ఆకు పచ్చని చీర కట్టి 
అవని నిండా అందాలను 
ఆరబోయాలని ఉంది 
ఆకొన్నవారికి ఒక కాయనో పండునో 
ప్రేమగా అందించాలని ఉంది
సొమ్మసిలిన బాటసారికి 
నీడనిచ్చి సేద దీర్చాలని ఉంది 
శిశిరంలో ఆకులు రాల్చుకొని 
సరికొత్తగా శిరసెత్తాలని ఉంది 
ప్రాణవాయువు పుక్కిలించి 
అఖిల జీవకోటికి 
ఆయువు పోయాలని ఉంది 

మరో జన్మంటూ ఉంటే
చెట్టునై పుట్టాలని వుంది
Image may contain: tree, grass, cloud, outdoor and nature

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి