పర్యావరణం గురించి
మీరు ఆలోచిస్తున్నారు
నేను హృదయావరణం గురించి మాట్లాడుతున్నాను
మీరు ఆలోచిస్తున్నారు
నేను హృదయావరణం గురించి మాట్లాడుతున్నాను
బ్రతుకు వనంలో
పచ్చదనం ఇగిరి పోవడం గురించి
ఎద లోయలలోకి
ఎండమావులు కదిలి రావడం గురించి
ఎద ఎదలో ఎండుటాకుల గలగలల గురించి
మీకు వివరిస్తున్నాను
పచ్చదనం ఇగిరి పోవడం గురించి
ఎద లోయలలోకి
ఎండమావులు కదిలి రావడం గురించి
ఎద ఎదలో ఎండుటాకుల గలగలల గురించి
మీకు వివరిస్తున్నాను
మల్లెపూల మందహాసాలు
మధురోహల మధూదయాలు
మానవ జీవితేతిహాసాల నుంచి
మటుమాయమై పోయిన వైనాన్ని
మీకు వివరిస్తున్నాను
మధురోహల మధూదయాలు
మానవ జీవితేతిహాసాల నుంచి
మటుమాయమై పోయిన వైనాన్ని
మీకు వివరిస్తున్నాను
మనిషి మనిషిని ప్రేమించే గొప్పదనం
మనసులతో కరచాలనం చేసే ప్రేమగుణం
కను మరుగైన దగ్ధదృశ్యాన్ని తిలకించమంటున్నాను
మనసులతో కరచాలనం చేసే ప్రేమగుణం
కను మరుగైన దగ్ధదృశ్యాన్ని తిలకించమంటున్నాను
నాటి పలకరింపులేవి
పరామర్సలేవి పరిచయాలేవి
ఆదుకోనడాలేవి ఆలింగనాలేవి
ఆర్ద్రత సౌహార్ద్రం సౌభ్రాతృత్వం ఆనవాళ్ళేవి
పరామర్సలేవి పరిచయాలేవి
ఆదుకోనడాలేవి ఆలింగనాలేవి
ఆర్ద్రత సౌహార్ద్రం సౌభ్రాతృత్వం ఆనవాళ్ళేవి
అంతా యాంత్రికం అంతా కృత్రిమం
పర్యావరణం కలుషితం కావడానికి కారణం
అంతరంగంలో పెల్లుబికిన కాలుష్యం
పర్యావరణం కలుషితం కావడానికి కారణం
అంతరంగంలో పెల్లుబికిన కాలుష్యం
మనిషి మనిషిగా లేకపోవడానికి కారణం
మానవతా విలువల పతనం విధ్వంసం
మానవతా విలువల పతనం విధ్వంసం
స్వార్ధం అసూయ పెను దాహం
వ్యామోహం ద్వేషం అమానుషం
మనిషిలోంచి మనిషిని విసిరేశాయి
మనిషిని మ్రోడుగా మార్చేశాయి
వ్యామోహం ద్వేషం అమానుషం
మనిషిలోంచి మనిషిని విసిరేశాయి
మనిషిని మ్రోడుగా మార్చేశాయి
పర్యావరణం గురించి ఆలోచించే ముందు
మన అంతరంగాన్ని ప్రక్షాళన చేసుకుందాం
నేలపైన పచ్చదనం మొలిపించే ముందు
మదిమదిలో అనురాగం విత్తనాలు చల్లుకుందాం
మమతల మొక్కలు నాటుదాం
మన అంతరంగాన్ని ప్రక్షాళన చేసుకుందాం
నేలపైన పచ్చదనం మొలిపించే ముందు
మదిమదిలో అనురాగం విత్తనాలు చల్లుకుందాం
మమతల మొక్కలు నాటుదాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి