27, అక్టోబర్ 2017, శుక్రవారం



కీర్తికండూతి 
ఒక మాయరోగం వంటిది
అతడి చూపు 
ఎప్పుడూ ఆకాశంలో ఉంటది
కల్లబొల్లి మాటలల్లె 
గుంట నక్కలు
మోసుకొచ్చే పొగడ్తలు వింటది
తనని గురించి నిజానిజాలు......
నిర్భయంగా తెలుసుకోలేని
అతని మనసెంతో కుంటిది
ఎవరేమనుకున్నా సరే 
నోరు తెరిస్తే చాలు 
గొప్పగా నేను నాది అంటది
ఎంత మెచ్చుకున్నా 
ఎచ్చులు చెప్పుకున్నా 
భరించరాని దుర్గంధమేగా 
మురికి గుంటది
నేలని విడిచి సాము చేస్తున్న 
అతని జీవితం 
పండిన పంటని కాదని 
ఏరుకొంటున్న పరిగ వంటిది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి