నీ జీవితం అద్భుతమని తెలుసుకో
నీలో దైవమున్నాడు కలుసుకో
ఒక మంచి మనిషిగా మహాత్మునిగా
చిన్ననాడే నిన్ను నీవు మలచుకో
ఎన్నెన్నో సమస్యలు అమావాస్యలు
గతంలోని మంచిని మాత్రమే తలచుకో
ఎవరూ నీకంటే గొప్పవారు కానే కారు
నిన్ను నీవే విజేతగా ఎలుగెత్తి పిలుచుకో
లోకంలో మంచి ఉన్నది మమత ఉన్నది
గంత లెందుకు రెండు కళ్ళు తెరుచుకో
నీ దేశం నీ జాతి నీ ఖ్యాతి ఎంతో గొప్పది
గుండె నిండా గాలి పీల్చి జబ్బ చరచుకో
నీలో దైవమున్నాడు కలుసుకో
ఒక మంచి మనిషిగా మహాత్మునిగా
చిన్ననాడే నిన్ను నీవు మలచుకో
ఎన్నెన్నో సమస్యలు అమావాస్యలు
గతంలోని మంచిని మాత్రమే తలచుకో
ఎవరూ నీకంటే గొప్పవారు కానే కారు
నిన్ను నీవే విజేతగా ఎలుగెత్తి పిలుచుకో
లోకంలో మంచి ఉన్నది మమత ఉన్నది
గంత లెందుకు రెండు కళ్ళు తెరుచుకో
నీ దేశం నీ జాతి నీ ఖ్యాతి ఎంతో గొప్పది
గుండె నిండా గాలి పీల్చి జబ్బ చరచుకో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి