27, అక్టోబర్ 2017, శుక్రవారం

అప్పుడప్పుడు 
ఆమె 
ఒక కలని 
వెంటపెట్టుకొని వస్తుంది 

ఇది
కల మాత్రమే
కాదు సుమా
అపురూపమైన శిల
అద్భుత శిల్పంగా
చెక్కమని అదేశిస్తుంది

ఆమె ఆజ్ఞ
శిరసావహించి
ఒక శిల్పానికి
ప్రాణం పోస్తాను

దానిని
తేరిపార చూచి
ఇదేమిటి అచ్చం
నా రూపం చెక్కావు
మురిపెంగా అంటుంది
ముద్దబంతిలా నవ్వుతుంది
Image may contain: 1 person, smiling, standing

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి