27, అక్టోబర్ 2017, శుక్రవారం


నా మీద 
ఒక అపప్రధ ఉన్నది
ఒక అపనింద 
నన్ను చిందరవందర చేస్తున్నది

ఏమిలేని చోట 
ఎన్నో అద్భుతాలు ఏకరవు పెడతానని

శూన్యం లో 
సుందర నందనవనాలు సృష్టిస్తానని

వాళ్లకు తెలియదు 
ఆమె సన్నిధిలో 
వనాలు సైతం కవనాలు గానం చేస్తాయని

మలయపవనాలు సైతం 
ఆమె కనుసన్నలలో 
ఎలుగెత్తి మధుర గీతాలు ఆలపిస్తాయని

కాలం 
కప్పుర పరిమళాలు వెదజల్లుకొంటు 
కమనీయంగా సాగి పోతుందని....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి