ఎత్తైన హిమాలయం
అరుదైన మహోదయం
భరత మాత పుణ్యఫలం
అతి పవిత్ర గంగాజలం
అన్ని కలిపిన -- అతడే
అతడే అతడే మహాత్ముడు //
కొల్లాయి గట్టినాడు
కర్ర చేత బట్టి నాడు
తెల్లవారిని ఎల్లల దాకా
తరిమి తరిమి కొట్టాడు
అతడే అతడే గాంధీ తాత
స్వతంత్ర భారత భాగ్య విధాత //
అహింసా వాదంతో
అద్భుతాలు చేశాడు
జాతిని మేల్కొలిపే
బోధ లెన్నో చేశాడు
అతడే అతడే జాతి పిత
అతనికి అంజలి ఘటియిస్తున్నది
నేడు , భరత జాతి -భరతమాత //
అరుదైన మహోదయం
భరత మాత పుణ్యఫలం
అతి పవిత్ర గంగాజలం
అన్ని కలిపిన -- అతడే
అతడే అతడే మహాత్ముడు //
కొల్లాయి గట్టినాడు
కర్ర చేత బట్టి నాడు
తెల్లవారిని ఎల్లల దాకా
తరిమి తరిమి కొట్టాడు
అతడే అతడే గాంధీ తాత
స్వతంత్ర భారత భాగ్య విధాత //
అహింసా వాదంతో
అద్భుతాలు చేశాడు
జాతిని మేల్కొలిపే
బోధ లెన్నో చేశాడు
అతడే అతడే జాతి పిత
అతనికి అంజలి ఘటియిస్తున్నది
నేడు , భరత జాతి -భరతమాత //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి