27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఒక స్వప్న లిపి 

ఒక కల ‘ఊ’ కొడుతుంది 
ఒక కల ‘జో’కొడుతుంది 
ఒక కల ‘జే’ కొడుతుంది
వచ్చిన ప్రతి కల
గుండె తలుపు తడుతుంది

కలని అడిగాను
రాత్రి ఎక్కడికిపోయావని
అన్నది కదా నువ్వు కలవరించే
ఆమెకోసం గాలించి అలిసిపోయానని

కలలో తప్ప తను కనబడదు
మౌనంలో తప్ప తను వినబడదు
ఒక్క నా కావ్యం లో తప్ప
ఆమె ఇంకెక్కడా అడుగిడదు

నా మనసు
ఎన్నో కలలకు జన్మ ఇచ్చింది
ఎన్నో సార్లు పువ్వై విచ్చింది
ఎన్నో హృదయాలకు ఎంతగానో నచ్చింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి