ఒక రేయి.....
నిన్ను నాకు -
నన్ను నీకు
కానుక ఇచ్చి
ఒంటరిదై పోతుంది
నిన్ను నాకు -
నన్ను నీకు
కానుక ఇచ్చి
ఒంటరిదై పోతుంది
ఒక హాయి.......
మల్లెపూల మాల గుచ్చి
పరిమళాలు కుమ్మరించి
సొమ్మసిల్లి పోతుంది
మల్లెపూల మాల గుచ్చి
పరిమళాలు కుమ్మరించి
సొమ్మసిల్లి పోతుంది
కనుదోయి......
స్వప్నాలరాసి పోసి
స్వర్గాల బాట వేసి
ద్వారాలు మూసి పోతుంది
స్వప్నాలరాసి పోసి
స్వర్గాల బాట వేసి
ద్వారాలు మూసి పోతుంది
ఒక వేయి
సుమదళాల పరిమళం
శయ్య పరచి నిన్ను వలచి
నన్ను పిలిచి కన్ను గీటి పోతుంది
సుమదళాల పరిమళం
శయ్య పరచి నిన్ను వలచి
నన్ను పిలిచి కన్ను గీటి పోతుంది
పెదవిని తాకిన
ప్రతి అణువు ఒక వేణువై
మౌనరాగం పాడి అలిసి పోతుంది
ప్రతి అణువు ఒక వేణువై
మౌనరాగం పాడి అలిసి పోతుంది
బిగి కౌగిలి దాటి వచ్చిన
ఒక నిశ్వాసం కారు మేఘమై
జీవనరాగం కురిసి పోతుంది
ఒక నిశ్వాసం కారు మేఘమై
జీవనరాగం కురిసి పోతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి