27, అక్టోబర్ 2017, శుక్రవారం


ఈ నదిలా నా హృదయం 
--------------------------
ఎక్కడ జన్మ ఎత్తిందో 
ఎన్ని తప్పటడుగులు వేసిందో 
ఎంత చిలిపిగా పరుగులు తీసిందో 
ఎన్ని చిందులు వేసిందో 
ఎన్ని విందులు చేసిందో 

ఇన్నాళ్ళు కొండల్లో కోనల్లో 
పరవళ్ళు తొక్కుతూ ప్రవహించిన నది
ఇప్పుడు సువిశాల మైదానం చేరుకొని 
మెల్లమెల్లగా నడుస్తున్నది 
మౌన గీతం ఆలపిస్తున్నది 

ఎన్ని మలుపులు తిరిగిందో 
ఎన్ని మమతలు తడిమిందో 
ఎన్ని వసంతాలు గానం చేసిందో, 
ఎన్ని నేలలకు వూపిరులూదిందో
ఇప్పుడు మందహాసం 
చిందిస్తూ అడుగులో అడుగేస్తున్నది 

ఇది జీవనది, 
సజీవ నది 
దీని అంతిమ గమ్యం మహోదధి 

నదికి హృదయమున్నది , 
నిన్నటి గాదల్ని నేమరేసుకొంటు న్నది 
తుది దశకు చేరుకొనే సరికి 
పాయలుగా విడిపోయి 
కడలి ఒడిలోకి చేరి 
కధలు కధలుగా 
తన గోడు వెళ్ళ బోసుకొంటు న్నది 
గత వైభవాన్ని నెమరేసు కొంటున్నది 

మనిషి జీవితం ఇంతేనేమో----------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి