27, అక్టోబర్ 2017, శుక్రవారం

వయ్యారంగా ఒళ్ళు విరుచుకున్నది ఒక గీతం 
ఆదమరచి దానిని అల్లిబిల్లిగా అల్లుకున్నది సంగీతం 

ఆ రాగసుధా రసధారలలో ఆ గాన వాహినిలో 
తేలియాడిన ప్రతి మనిషి జీవితం సుప్రభాతం 

పదే పదే పాటల తోటలలో పరవశగానం వింటూ
హాయిగా విహరించే మనిషి మనసు నవనీతం

అక్రమాలలో ఆందోళనలో అట్టుడికిన అవని
చిరకాలంగా కోరుకొంటున్నది ఉజ్వల జనగీతం

కొండల కోనల మలుపుల్లో మలయానిల లాలన
వింటూ సాగిపోతున్నది అందమైన జలపాతం

సుమదళాల పరిమళాల గీతాలాపన వింటూ
సోలిపోతున్నది అరవిరిసిన సుందర పారిజాతం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి