27, అక్టోబర్ 2017, శుక్రవారం


కవి బ్రహ్మ 
----------
అన్ని బొమ్మలు తయారు చేసి 
రకరకాల ఆకారాలు సమకూర్చి 
కోట్ల మందికి ప్రాణం పోయడ మంటే మాటలా
అందుకే మనిషి మనిషికి ఇన్ని రూపురేఖలు 

నా పని 
ఇలాగె ఉందని చెప్పడానికి 
ఈ ఉదంతం ఉటంకించాను 
కాల మంతా రాయడానికే 
సరిపోతే వాటిని సరిదిద్దే దెప్పుడు 
అందంగా మరింత సుందరంగా చెక్కి 
అర్ధవంతంగా మలిచే దెప్పుడు 
మీ ముందుకు నడిచే దెప్పుడు 

నా పాతబడి పోయిన డైరీల్లో 
వందల వేల కవితలు 
ఇంకా పురుడు పోసుకొనని గీతాలు 
మొగ్గలోనే దాగివున్న సుమ పారిజాతాలు 

ఇలాగె పడి ఉన్నాయేమో 
బ్రహ్మదేవుని ముంగిలిలో కోకొల్లలుగా 
ముక్కు మొహం మనిషి ఆకారం 
ఇంకా సరిగా అమర్చని బొమ్మలు 

చిత్రమేమిటంటే 
ఆ బ్రహ్మ దేవుని సృష్టి కొంతకాలమే
ఈ మనిషి జీవితం కొన్ని సంవత్సరాలే 

కాని నా రచనలు 
కాలానికి అతీతమైనవి 
అజరామరమైనవి 
నేను నిష్క్రమించినా అవి 
ఈ నేలలో ఈ గాలిలో విహరిస్తూ ఉంటాయి 
రాబోయే తరాలను పలకరిస్తూ ఉంటాయి 

(ఎర్రన జన్మించిన ఊరిలో మొలకెత్తిన 
నా అదృష్టాన్ని మననం చేసుకొంటూ .
ఆ ప్రబంధ పరమేశ్వరుని స్మరించుకొంటూ ..)
Image may contain: 1 person

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి