27, అక్టోబర్ 2017, శుక్రవారం

నువ్వు నువ్వేనా !?

ఆమె ఎప్పుడు అలా అడిగి ఉండలేదు 
ఎందుకొచ్చింది అనుమానం 

ఈ కవిత లేమిటి 
నిప్పుల వర్షం కురిపించా వేమిటి
ఆ కళ్ళల్లో చింత నిప్పుల్లా ఎర్ర జీరలేమిటి 

అభ్యుదయం అన్నాను 

వంకాయ కాదూ- !!!
నువ్వు 
నా ఏకైక ప్రణయ చక్రవర్తివి మరిచి పోకు 
నీ హృదయం అతి సున్నిత మైనది 
అలా మండి పడకు 

నన్ను మందలించింది 
ఇంకెప్పుడు ఈ తప్పు చేయకు సుమా 
తర్జనితో హెచ్చరించింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి