అర్ధం చేసుకో ......రూ !!!
-------------------------- -----------
‘’మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికి సుఖము లేదంతే ‘’
‘’మనసులేని బ్రతుకొక నరకం
మనిషి కెక్కడ ఉన్నది స్వర్గం ....
మరణమేనా దానికి మార్గం ..’’
ఇలా ఎన్నో పాటలు రాశారు మనసుకవి ఆత్రేయ
చెవియొగ్గి వినమని విన్నపాలు చేశాడు
ఎన్నో సిరులు సంపదలు ఉన్నాయి
వాటిని చుట్టుకొని బాధలు భయాలు ఉన్నాయి
నిదుర రాని నిసిరాత్రులున్నాయి
నిత్యం మరణ యాత్రలున్నాయి
ఎందుకీ బాధని -ఎందుకొచ్చిన గొడవని
అసలు మనసునే వదులుకున్నాడు మనిషి
ఇప్పుడు
మనసులు లేవు మమతలు లేవు
అనురాగాలు ఆప్యాయతలు
సమతలు సమానతలు లేవు
సరిగమలు లేవు సరాగాలు లేవు
అన్ని బోలు దేహాలు
అనంత దాహాలు అర్ధంలేని వ్యామోహాలు
‘మనసున మనసై’ అని
పాడుకొనే మంచి కాలం చెల్లిపోయింది
‘ఎవరికీ వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో ‘
అనే గీతం అక్షరాలా నిజమై కూర్చుంది
మనసే ఒక మధుకలశమని
జీవితం అందాల జలపాత మని
ఎవరికీ చెప్పాలి ఎలా చెప్పాలి
ఏమిటో ఈ మనుషులు
ఎంత చెప్పినా అర్ధం చేసుకో ............రూ .
--------------------------
‘’మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికి సుఖము లేదంతే ‘’
‘’మనసులేని బ్రతుకొక నరకం
మనిషి కెక్కడ ఉన్నది స్వర్గం ....
మరణమేనా దానికి మార్గం ..’’
ఇలా ఎన్నో పాటలు రాశారు మనసుకవి ఆత్రేయ
చెవియొగ్గి వినమని విన్నపాలు చేశాడు
ఎన్నో సిరులు సంపదలు ఉన్నాయి
వాటిని చుట్టుకొని బాధలు భయాలు ఉన్నాయి
నిదుర రాని నిసిరాత్రులున్నాయి
నిత్యం మరణ యాత్రలున్నాయి
ఎందుకీ బాధని -ఎందుకొచ్చిన గొడవని
అసలు మనసునే వదులుకున్నాడు మనిషి
ఇప్పుడు
మనసులు లేవు మమతలు లేవు
అనురాగాలు ఆప్యాయతలు
సమతలు సమానతలు లేవు
సరిగమలు లేవు సరాగాలు లేవు
అన్ని బోలు దేహాలు
అనంత దాహాలు అర్ధంలేని వ్యామోహాలు
‘మనసున మనసై’ అని
పాడుకొనే మంచి కాలం చెల్లిపోయింది
‘ఎవరికీ వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో ‘
అనే గీతం అక్షరాలా నిజమై కూర్చుంది
మనసే ఒక మధుకలశమని
జీవితం అందాల జలపాత మని
ఎవరికీ చెప్పాలి ఎలా చెప్పాలి
ఏమిటో ఈ మనుషులు
ఎంత చెప్పినా అర్ధం చేసుకో ............రూ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి