27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఏ మనిషిని చూచినా 
ఎక్కుపెట్టిన బాణంలా ఉన్నాడు 
ఎందుకో మరి చాలీ చాలక 
గుక్కపట్టిన ప్రాణంలా ఉన్నాడు
అర్ధంలేని ఆశలతో కంపుకొట్టే అలోచనలతో 
నిషిద్ధగానంలా ఉన్నాడు
తెగిన గాలిపటంలా ఉన్నాడు
ఉవ్వెత్తున ఎగిసిపడిన తరంగంలా ఉన్నాడు
మరణ మృదంగం లా ఉన్నాడు

ఎందుకో ఈ మనిషి
క్షీరసాగర మధనం అనంతరం
అమృతం దొరకని దానవుడిలా ఉన్నాడు
దారుణ మారణానికి సిద్ధం చేసిన
మారణాయుధం ఉన్నాడు

ఎందుకో ఎందుకో
ఈ మనిషి నడుస్తున్న శవంలా ఉన్నాడు
ఊపిరి బిగబట్టి భయం భయంగా ఉన్నాడు
నీరవ నిశీధంలా నిర్వేదంగా నిస్తేజంగా ఉన్నాడు
*****
నిన్న ఒక మనిషిని చూశాను\
ఆశ్చర్యం అనిపించింది
ఒక మనసుని చూశాను
అద్భుతం అనిపించింది
ఎంతకాలానికి
మనిషి రూపం కనిపించింది
ఎన్నాళ్ళకి
ఒక మానవతా గీతం వినిపించింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి