27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఇంకేమి వ్రాయను !
ప్రణయ సౌందర్య హర్మ్య 
ప్రాకార కుడ్య రస వర్ణనలు తప్ప 

ఇంకేమి పాడను !
సుందర సుమధుర మనోజ్ఞ ప్రణయ
సుమ గీతికలు తప్ప

కనుపింపదు ఇంకేది !
సౌందర్య గిరి సానువుల చెంగు చెంగున ఉరుకు
సెలయేటి తరంగ కురంగ సంచయము తప్ప

వినిపింపదు ఇంకేది !
శృంగార సాలభంజికల పద మంజీర
మంజుల సంగీత విభావరి తప్ప

నా భావం .........
మధుమాస సమాగమ వేళ
ఎలుగెత్తి పాడుతున్న ఎలకోయిల

నా ధ్యానం .....
ఆ పాట ప్రతి చరణమ్ములో పొదిగిన
ప్రణయాక్షరాల ప్రసూన మాల

డా సినారే ఆవిష్కరించిన నా మొదటి కావ్యం ‘’పుప్పొడి రాలిన చప్పుడు’’ (1999)లోని చివరి కవిత –వారిని సంస్మరించు కొంటూ, వారికి నివాళి అర్పిస్తూ ---------
Image may contain: 2 people, people smiling, people standing and indoor

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి