27, అక్టోబర్ 2017, శుక్రవారం


ఎన్ని కలలకు వూపిరులూదానో 
ఎన్ని శిలలకు ప్రాణం పోశానో 

ఎన్ని అలలకు ఆలాపన నేర్పానో 
ఎన్ని సుమాలకు సొబగులు దిద్దానో 

ఎంత వెన్నెలకు వన్నెలు అద్దానో 
ఎన్ని పవనాలను ఉసి గొలిపానో 

నిన్ను కీర్తించడం కోసం 
నీకు ఒక ఆకారం కల్పించడం కోసం

ఎన్ని క్షణాలు వెచ్చించానో 
ఎన్ని కలలు కర్పూర హారతిగా పట్టానో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి