ఒక గీతం మొలకెత్తాలంటే ----------
====================
అక్షరం సరసన అక్షరం చేర్చడం ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదు
ఒక పదం వయ్యారంగా నడిచొచ్చి ఒదిగి పోవడం అంత తేలిక కాదు
అలవోకగా ఒక భావాన్ని సన్నివేశాన్ని సందర్భాన్ని మోసుకొని
ఒక లయని సొంతం చేసుకొని ఒక గీతం నర్తించడం సులభం కానే కాదు
పదం కోసం వెదకడం కాదు అది తనంతట తను వచ్చి వాలాలి
అది మదిలో నిదుర లేచిన మధుర భావాలకు వూపిరి పోయాలి
అనంతరం రాగాలు తొడుక్కొని సంగీత సాహిత్య రసడోలలలో
ఓలలాడిన రసజ్ఞుల హృదయాలు ఆనంద తాండవం చేయాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి