’మనిషికెన్ని గాయాలైనా -మాసి పోవు నేలాగైనా
మనసుకొక్క గాయమైనా- మాసి పోదు చితిలోనైనా ‘’
మనిషి దగా మనసు దగా
అడుగడుగునా దగాదగా
గాయాలు ఔతుంటాయి
అల్పపీడనాలు పుడుతుంటాయి
తుఫానులుగా మారుతుంటాయి
ఎటువంటి విపత్కర పరిస్థితుల లోనైనా
వాటికి తల వొగ్గక సాగేదే జీవితం
ఎన్ని అభంగ తరంగాలో, అశనిపాతాలో
భరించడం లేదా ఎగిరి దూకే జలపాతం
అనురాగాలు అనుబంధాలు
అదృశ్య మైన ఈ లోకంలో
గాయాలు సహజం
మనం రకరకాల జంతు జాలాలున్న
జనారణ్యంలో ఉన్నా మన్నది నిజం
ఎదురైనా ప్రతి వాడు
అదేపనిగా సృష్టిస్తుంటాడు వడగాలి
ఆ బాధలన్ని ఎలాగోలాగు
అధిగమించగలగాలి
మనసున్న మనిషికి మధనం తప్పదు
అస్తమానం ఆలోచన మెలిపెడితే
అకాల మరణం తప్పదు
ఏమిటి ఇలా మారిపోయారు జనం
అని గగ్గోలు పెడితే ఏమి ప్రయోజనం ?
కాలం మారుతుంది
చేసిన గాయాలు మాన్పుతుంది
అలా సంగీతం పాడుకొంటూ
సాగిపోతే అదే అసలైన జీవితం
మనసుకొక్క గాయమైనా- మాసి పోదు చితిలోనైనా ‘’
మనిషి దగా మనసు దగా
అడుగడుగునా దగాదగా
గాయాలు ఔతుంటాయి
అల్పపీడనాలు పుడుతుంటాయి
తుఫానులుగా మారుతుంటాయి
ఎటువంటి విపత్కర పరిస్థితుల లోనైనా
వాటికి తల వొగ్గక సాగేదే జీవితం
ఎన్ని అభంగ తరంగాలో, అశనిపాతాలో
భరించడం లేదా ఎగిరి దూకే జలపాతం
అనురాగాలు అనుబంధాలు
అదృశ్య మైన ఈ లోకంలో
గాయాలు సహజం
మనం రకరకాల జంతు జాలాలున్న
జనారణ్యంలో ఉన్నా మన్నది నిజం
ఎదురైనా ప్రతి వాడు
అదేపనిగా సృష్టిస్తుంటాడు వడగాలి
ఆ బాధలన్ని ఎలాగోలాగు
అధిగమించగలగాలి
మనసున్న మనిషికి మధనం తప్పదు
అస్తమానం ఆలోచన మెలిపెడితే
అకాల మరణం తప్పదు
ఏమిటి ఇలా మారిపోయారు జనం
అని గగ్గోలు పెడితే ఏమి ప్రయోజనం ?
కాలం మారుతుంది
చేసిన గాయాలు మాన్పుతుంది
అలా సంగీతం పాడుకొంటూ
సాగిపోతే అదే అసలైన జీవితం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి