27, అక్టోబర్ 2017, శుక్రవారం

అలజడి
నాలో అడుగిడి నప్పుడు 
ఆమె వడివడిగా వస్తుంది 

ఎందుకు 
చిడిముడి పడతావని
ఒడిలో చేర్చుకొని ఓదారుస్తుంది

ఆమే గనక లేకుంటే
ఎడతెరిపి లేకుండా
ఎన్నో తుఫానులు
నాలో ప్రవేశించి ఉండేవి

ఎన్నెన్నో
విషాదాలు నిశీదాలు
నిర్వేదాలు మది నిండేవి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి