27, అక్టోబర్ 2017, శుక్రవారం

నాదేమో గుప్పెడు గుండె ....
నిండి పోయింది తాను 
ఎదలో ఉక్కిరిబిక్కిరి చేస్తూ 
వూపిరాడనీయకుండా 

ఇంక- ఎలా మిన్నకుండగలను
ఏమి రాయకుండా ఎలుగెత్తి పాడకుండా
పోనీ తనను దూరంగా పంపేద్దామంటే
ఆమే కదా నాకు అండదండ

మీతో ఈ విషయం అంటున్నానని,
నా బాధ చెప్పుకున్నానని
తలనిండా పూలు ధరించడమే కాకుండా,
పట్టుకొచ్చింది ఒక పూలదండ
పూలదండతో పాటు
రెండు బాహువులు సాచి
అల్లుకున్నది మెడనిండా

ఇంకెలా మనగలను జీవించగలను
ఒక నిముసమైనా ఆమె లేకుండా -------

‘చెప్పాలని ఉంది
దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కధ
మట్టిని మణిగా చేసిన మరపురాని దేవత కధ ‘’

మీరే చెప్పండి ఎలా మిన్నకుండ గలను
ఇలా రాయకుండా, హాయిగా పాడకుండా
-- -- ---
ఇన్ని ‘డాం ‘ లతో –
డాండ డడాండ డాండవం - చేసిన
నన్ను ఏం చేయాలని అనుకొంటున్నారా
అమ్మయ్య గండం గడిచిందని
హాయిగా వూపిరి పీల్చుకొంటున్నారా

అంత సులభం కాదు మిత్రమా!
ఇలా రాస్తూనే ఉంటాను ఇంకా
మీకు వూపిరాడ నీయకుండా
మీరు మాత్రం దూరంగా నెట్టేయకండి
దీనిని ఆసాంతం ఆ మూలాగ్రం చదవకుండా

......................

(పదాలతో కాసేపు చిలిపి కలాపం--అంతే -- అన్యదా భావించకండి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి