చిరుగాలి
వస్తూనే నమస్కరించింది
ఎంత సేపటినుంచో
ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను
వెళ్ళినపని ఏమయింది అన్నాను!
నీలి ముంగురులను ఎగురవేసాను
జారు పయ్యెదను గాలిపటంలా చేశాను
చీర కుచ్చెళ్లు చిడిముడి చేశాను
మరు మల్లెల సౌరభాన్ని అమెపైకి ఉసి గొలిపాను
నీ అజ్ఞను తు. చ. తప్పక పాటించాను
ఎంత మంచిదానవో
ఏమివ్వను నీకేమివ్వను అడిగాను
ఇచ్చిన పని అద్భుతము
అపురూపమైనది కదా
ఇంతకన్నా ఇంకేమి కావాలి దొరా!
ధన్యోస్మి అంటూ
వచ్చిన పని దివ్యంగా ముగిసిందని
మలయానిలం ఆనందంగా వెళ్లి పోయింది
వెంటనే ఒక కావ్యానికి శ్రీకారం చుట్టాను
వస్తూనే నమస్కరించింది
ఎంత సేపటినుంచో
ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను
వెళ్ళినపని ఏమయింది అన్నాను!
నీలి ముంగురులను ఎగురవేసాను
జారు పయ్యెదను గాలిపటంలా చేశాను
చీర కుచ్చెళ్లు చిడిముడి చేశాను
మరు మల్లెల సౌరభాన్ని అమెపైకి ఉసి గొలిపాను
నీ అజ్ఞను తు. చ. తప్పక పాటించాను
ఎంత మంచిదానవో
ఏమివ్వను నీకేమివ్వను అడిగాను
ఇచ్చిన పని అద్భుతము
అపురూపమైనది కదా
ఇంతకన్నా ఇంకేమి కావాలి దొరా!
ధన్యోస్మి అంటూ
వచ్చిన పని దివ్యంగా ముగిసిందని
మలయానిలం ఆనందంగా వెళ్లి పోయింది
వెంటనే ఒక కావ్యానికి శ్రీకారం చుట్టాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి