27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఒక మానవతా గీతం 
---------------------

చిన్నదిరా- జీవితం 
ఎవ్వరురా శాశ్వతం
చిగురించనీ మంచితనం
పరిమళించనీ మానవత్వం //

మళ్ళి పుడతావో లేదో మనిషిగా
మంచి పనులు చేయరా ఇప్పుడే
మరణ మనివార్యమని తెలుసుగా
మరణించినా బ్రతికుంటావు అప్పుడే

జాతస్య మరణం ధృవం
మనసుంటే ఏదైనా సంభవం
నిన్ను నీవు తెలుసుకో
నీలో మానవుడున్నాడు కలుసుకో //

నీవుండే దిక్కడ కొన్నాళ్ళే
నిజమైన జీవితాన్ని కోరుకో
బ్రతుకంతా కావాలని కన్నీళ్ళే
నిధుల కొరకు వేట మానుకో

జీవితం క్షణ భంగురం
కనుమరుగై పోతామందరం
వంచన ఎందుకు మానుకో
మంచిని మించిన మార్గం లేదని తెలుసుకో //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి